Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రేమ పెళ్లితో కుల బ‌హిష్క‌ర‌ణ‌.. ఊరిలో శుభ‌కార్యాల‌కు నో ఎంట్రీ..!

క‌లం, వెబ్ డెస్క్‌: కాలం మారిపోతున్నా.. ప్ర‌పంచం ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని గ్రామాల్లో అంధ విశ్వాసాలు, సంకుచిత భావాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. కుల‌, మ‌త బేధాల‌తో మ‌నుషుల మ‌ధ్య దూరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘ‌ట‌నే జ‌గిత్యాల (Jagtial) జిల్లాలో చోటు చేసుకుంది. కులాంతర వివాహం (Intercaste Marriage) చేసుకున్న ఓ ప్రేమ జంట‌ను కుల బ‌హిష్క‌ర‌ణ చేశారు. అంత‌టితో ఆగ‌కుండా ఊరిలో ఏ శుభ‌కార్యానికి రానివ్వ‌కుండా మాన‌సిక వేద‌న‌కు గురి చేశారు. దీంతో త‌మ గోడు వెళ్ల‌బోసుకుంటూ ఆ జంట ప్ర‌జావాణిని ఆశ్ర‌యించింది.

జగిత్యాల జిల్లాకు చెందిన సంగీత, బద్దీ పవన్ ప్రేమించుకున్నారు. ఇద్ద‌రివి వేర్వేరు కులాలు (Jagtial Intercaste Marriage) కావ‌డంతో ఇరు కుటుంబాల్లో వీరి ప్రేమ‌ను వ్య‌తిరేకించారు. దీంతో 2023లో ప్రేమికులిద్ద‌రూ కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత‌ పవన్, సంగీత దంపతులను త‌మ‌ పెద్ద‌లు కుల బహిష్కరణ చేశారు. ఊరిలో ఏ శుభకార్యాలకు వారిని రానివ్వకూడ‌ద‌ని నిర్ణ‌యించారు. త‌మ‌కు జ‌రుగుతున్న అవ‌మానం త‌ట్టుకోలేక ఇద్ద‌రూ సోమ‌వారం జ‌గిత్యాలలో ప్ర‌జావాణిని ఆశ్ర‌యించారు. ఊరిలో త‌మ‌పై క‌క్ష‌సాధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికే ఓసారి అధికారుల‌కు ఈ విష‌యం చెప్పి ఫిర్యాదు చేశామ‌ని, అయినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని తెలిపారు. ఇప్ప‌టికైనా త‌మ‌కు న్యాయం చెయ్యాల‌ని వేడుకుంటున్నారు.

Read Also: న‌గ‌రంలో ‘పెళ్లి’ మోసాలు.. అప్ర‌మ‌త్తంగా లేకుంటే అంతే సంగ‌తి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>