కలం, వెబ్ డెస్క్ : వరల్డ్ బాక్సింగ్ కప్ 2026 (World Boxing Cup 2026) (స్టేజ్-2)లో భారత బాక్సర్లు (Indian Boxers) అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో విజయాలతో భారత్ ఇప్పటికే ఆరు పతకాలను ఖరారు చేసుకుంది. ప్రజ్చి, మీనాక్షి, దీపక్, నిఖిల్ సెమీఫైనల్‌కు చేరి దేశానికి పతకాలు సాధించారు. 57 కేజీల విభాగంలో పోటీపడిన ప్రజ్చి అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత షిహ్ యీ వూను 4-1 తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 51 కేజీల విభాగంలో మీనాక్షి కూడా తన సత్తా చాటింది.
ప్రపంచ ఛాంపియన్, మూడో ర్యాంకర్ అలువా బాల్కిబెకోవాపై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. పురుషుల విభాగంలో దీపక్ (70 కేజీలు) అజర్‌బైజాన్‌కు చెందిన నబీ ఇస్గందరోవ్‌పై 5-0 తేడాతో విజయం సాధించాడు. మరోవైపు నిఖిల్ (55 కేజీలు) కూడా అజర్‌బైజాన్‌కు చెందిన అమిన్ మమ్మద్‌జాదాపై 5-0తో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించాడు. అయితే 65 కేజీల విభాగంలో సనేహ్ గట్టి పోరాటం చేసినప్పటికీ పోలాండ్‌కు చెందిన కింగా క్రోవ్కా చేతిలో 0-5 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే జ్యోతి, జుగ్నూ సెమీఫైనల్‌కు చేరి పతకాలను ఖాయం చేసుకోగా, తాజా విజయాలతో భారత్ మొత్తం ఆరు పతకాలను నిర్ధారించుకుంది. ఇప్పుడు భారత బాక్సర్ల లక్ష్యం ఫైనల్‌కు చేరుకుని స్వర్ణ పతకాలు సాధించడం పై ఉంది.

