Mobile Popup Ad
Mobile Popup Ad

విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ సంక్షేమంపై మంత్రి సీతక్క సమీక్ష

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం దిశగా కృషి చేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOAs) సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో వీఓఏలతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వారికి అందుతున్న సదుపాయాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ అవసరాలపై స్వయంగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీఓఏల సమస్యలను ఓర్పుగా విన్న మంత్రి, ప్రభుత్వం వారి సంక్షేమం, సేవా భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం పలు కీలక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

సమావేశం సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా సంఘాల సమాఖ్యలు గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి వెన్నెముకలుగా నిలుస్తున్నాయని అన్నారు. ఆ సమాఖ్యలను సమర్థవంతంగా నడిపించడంలో వీఓఏలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. వారి కృషిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ప్రత్యేకంగా వీఓఏలకు గౌరవ వేతనం అందిస్తున్న రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు. జీఓ నెం.58 ప్రకారం రాష్ట్రంలోని 17,609 గ్రామ సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్న వీఓఏలకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రతి నెల రూ.8.80 కోట్లు, ఏడాదికి రూ.105.60 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోందని చెప్పారు. ఇప్పటివరకు వీఓఏల గౌరవ వేతనాల కోసం రూ.661.92 కోట్లకు పైగా ప్రభుత్వం రిలీజ్ చేసిందని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>