టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రిజల్ట్స్ ఇవే

కలం, వెబ్ డెస్క్ : మార్చి 8న జరిగే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ఫైనల్‌కు ముందు ఆసక్తికర గణాంకం బయటపడింది. ఆతిథ్య జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ (India) ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ టోర్నమెంట్ చరిత్రలో మాత్రం న్యూజిలాండ్‌(New Zealand)పై భారత్ ఒక్కసారి కూడా గెలవలేదు.

టీ20 ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్ 2007లోనే ఈ ఆధిపత్యం మొదలైంది. జోహానెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్లు భారత జట్టును నిలువరించారు. ఆ మ్యాచ్‌లో 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ 76/1తో ముందంజలో ఉండగా.. వెట్టోరి బౌలింగ్‌కు వచ్చి కీలక వికెట్లు తీసాడు. రాబిన్ ఊతప్ప, ప్రస్తుతం భారత కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌ను ఔట్ చేశాడు. తరువాత స్పిన్నర్ జీతన్ పటేల్.. యువరాజ్ సింగ్‌ను ఔట్ చేశాడు. చివర్లో వెట్టోరి మళ్లీ బౌలింగ్ చేసి ఇర్ఫాన్ పఠాన్, దినేష్ కార్తిక్ వికెట్లు తీసి మ్యాచ్ ముగించాడు.

2016 టీ20 ప్రపంచకప్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్(New Zealand) స్పిన్నర్లు మరోసారి ఆధిపత్యం చూపించారు. కేవలం 126 పరుగుల లక్ష్యాన్ని కాపాడుతూ భారత్‌ను 79 పరుగులకే కట్టడి చేశారు. ఆ మ్యాచ్‌లో మిఛెల్ శాంట్నర్ 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఇష్ సోది మూడు వికెట్లు సాధించాడు. నతన్ మెక్కలమ్ రెండు వికెట్లు తీసాడు. భారత జట్టులో విరాట్ కోహ్లీ 23, ఎంఎస్ ధోనీ 30 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపించారు.

2021 టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ న్యూజిలాండ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయింది. భారత జట్టు 110/7కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బోల్ట్ కీలక వికెట్లు తీశాడు. చేజింగ్ సమయంలో మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్ వేగంగా పరుగులు చేసి న్యూజిలాండ్‌కు బలమైన ఆరంభం ఇచ్చారు. చివరగా కేన్ విలియమ్‌సన్ బౌండరీతో మ్యాచ్ ముగించాడు. ఈ రికార్డ్‌ను చూస్తే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించింది లేదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాజ్ జరిగిన ప్రతిసారీ కివీస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మార్చి 8న జరిగే ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Read Also: మహిళలకు నెలకు రూ.2500, ఉచిత గ్యాస్ సిలిండర్లు : విజయ్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>