Mobile Popup Ad
Mobile Popup Ad

హాకీ నేషన్స్ కప్ సెమీస్‌లోకి భారత్ ఘీంకార పరంపర!

కలం, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్‌ (FIH Nations Cup) లో భారత జట్టు అజేయంగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్-ఎ లో అమెరికా, జపాన్, ఉరుగ్వేలపై వరుస విజయాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ అర్హత సాధించడానికి భారత్ మరో అడుగు దూరంలో నిలిచింది. ఆనందన – ది కోకాకోలా ఇండియా ఫౌండేషన్ మద్దతుతో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న ఐదుగురు క్రీడాకారిణులు ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశారు. హర్యానాకు చెందిన డ్రాగ్-ఫ్లిక్కర్ దీపిక అమెరికా, ఉరుగ్వేలపై తలా రెండు గోల్స్ చేసి, టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచింది.

గోల్‌కీపర్లు సవిత, బిచు దేవి ఖరిబమ్ ప్రత్యర్థి జట్లను సమర్థవంతంగా అడ్డుకున్నారు. డిఫెండర్ లాల్తాంట్లుయాంగి, ఫార్వర్డ్ ప్లేయర్ అన్ను కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మహిళా క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆనందన ఫౌండేషన్ సాయి బెంగళూరులో ప్రత్యేక గోల్‌కీపింగ్, అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో డ్రాగ్-ఫ్లికింగ్ శిబిరాలను నిర్వహించింది. ఈ ప్రత్యేక శిక్షణ వల్ల తమ ఆటతీరు ఎంతో మెరుగైందని దీపిక కృతజ్ఞత వ్యక్తం చేసింది. క్రీడాకారిణుల ప్రతిభను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీ, కోకాకోలా ప్రతినిధి దేవ్యాని రాణా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>