కలం, స్పోర్ట్స్ : ఆర్చరీలో భారత్ సత్తా చాటింది. ఆసియా క్రీడల్లో(Asian Games) పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణం గెలిచింది. కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేశ్ మణి రత్నం జట్టు ఈ ఘనత సాధించింది. ఫైనల్లో చైనాతో భారత్ హోరాహోరీగా తలపడింది. చివరకు 238-237తో చైనాను ఓడించి గోల్డ్ మెడల్ (India Gold Medal) సొంతం చేసుకుంది. అంతకుముందు మహిళల కాంపౌండ్ టీమ్ కూడా స్వర్ణం సాధించింది.
జ్యోతి సురేఖ వెన్నం, చికితా తానిపర్తి, పృథికా ప్రదీప్ జట్టు 238-234తో చైనాను ఓడించింది. మిక్స్డ్ టీమ్‌లోనూ భారత్ విజయం సాధించింది. చికితా, సాహిల్ జోడీ షూట్‌ఆఫ్‌లో దక్షిణ కొరియాను ఓడించింది. దీంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు భారత్‌కు కోటా స్థానం దక్కింది. పురుషుల జట్టు రౌండ్ ఆఫ్ 16లో యూఏఈని 235-215తో, క్వార్టర్ఫైనల్లో భూటాన్‌ను 235-232తో ఓడించి ఫైనల్‌కు చేరింది.

