కలం, డెస్క్ : ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్ పై (India US Trade Deal) పెద్ద రచ్చనే నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో డీడీజీఎస్ పెద్ద ఇష్యూ అయిపోయింది. అమెరికా నుంచి 50 లక్షల టన్నుల డీడీజీఎస్ లను సున్నా సుంకాలతో ఇండియా దిగుమతి చేసుకోవాలని ఈ ట్రేడ్ డీల్ లో ఉంది. ఇక్కడే పెద్ద ఇష్యూ మొదలైంది. అమెరికా డీడీజీఎస్ లను ఇండియాలోకి అనుమతించొద్దు అని మన దేశంలో ఉన్న డీడీజీఎస్ కంపెనీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు, సామాజిక వేత్తలు, రైతుల నుంచి కూడా ఇవే డిమాండ్లు వస్తున్నాయి. దీంతో డీడీజీఎస్ పేరు మార్మోగిపోతోంది. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది.. డీడీజీఎస్ అంటే ఏంటి అనేది ఇందులో తెలుసుకుందాం.
డీడీజీఎస్ అంటే..?
డీడీజీఎస్ అంటే Distillers Dried Grains with Solubles. ఈ ట్రేడ్ డీల్ లో అమెరికా ఉత్పత్తి చేసే డీడీజీఎస్ లను ఇండియా 0 సుంకాలతో దిగుమతి చేసుకోవాలని ఉంది. ఈ డీడీజీఎస్ లను కోళ్ల ఫారమ్ లో, ఫిష్ ఫీడ్, ఆవుల ఫీడ్ ల కోసం వాడుతారు. అమెరికాలో మొక్కజొన్న లేదా రైస్ తో గానీ తయారు చేసేటువంటి ఇథనాల్ నుంచి బై ప్రొడక్ట్ గా ఇది వస్తుంది. డీడీజీఎస్ ప్రొడక్షన్ రంగం మన దేశంలో కూడా ఉంది.
వివాదం ఏంటి..?
మన దేశంలో ఉన్న పాడి పరిశ్రమ రంగానికి 11 కోట్ల టన్నుల డీడీజీఎస్ లు కావాలి. కానీ ప్రస్తుతం ఇండియాలో 5 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు ట్రేడ్ డీల్ లో 0.5 పర్సెంట్ అంటే 50 లక్షల టన్నులు దిగుమతి చేసుకునేలా ఒప్పందం కుదిరింది. కానీ అమెరికా తయారయ్యే డీడీజీఎస్ లు జెనెటిక్ మాడిఫికేషన్ తో తయారైన కార్న్ లేదా రైస్ నుంచి దీన్ని తయారు చేస్తారు. మన దేశంలో తయారయ్యే డీడీజీఎస్ మొక్క జొన్న మేజ్ నుంచి లేదా సోయా, వరి నుంచి తయారవుతుంది. ఇవేవీ కూడా మన దేశంలో జెన్యు మార్పిడి జరిగినవి కావు. కానీ అమెరికా ఉత్పత్తి చేసే డీడీజీఎస్ లు కంప్లీట్ గా జెన్యు మార్పిడిలతో కూడినవే. మన దేశంలో జెన్యు మార్పిడిపై చాలా ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి ఇండియన్ డీడీజీఎస్ లను నాన్ జీఎంలుగానే ఉత్పత్తి చేస్తున్నారు.
కానీ ఇప్పుడు అమెరికా డీడీజీఎస్ ల వల్ల జెనెటిక్ మాడిఫికల్ ప్రాడక్ట్స్ ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. అమెరికా జెనెటికల్ మాడిఫికేషన్ డీడీజీఎస్ లను ఆవులు, ఫిష్, కోళ్లు తిన్న తర్వాత ఇది ఫుడ్ చెయిన్ లోకి ఎంటర్ అవుతుంది కదా అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. ఇండియాలో జెనెటికల్ మాడిఫికేషన్ వద్దు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు అమెరికా డీడీజీఎస్ ల వల్ల ఇన్ డైరెక్ట్ గా తీసుకొస్తోంది కదా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అమెరికా డీడీజీఎస్ లనే కొనే ఛాన్స్..?
అమెరికా డీడీజీఎస్ లపై మన దేశంలో 0 శాతం సుంకాలు ఉంటే రేట్లు తక్కువగా ఉంటాయి అని కొందరు వాదిస్తున్నారు. కానీ ఇండియన్ డీడీజీఎస్ లతో పోలిస్తే అమెరికా డీడీజీఎస్ లు కొంత ఎక్కువ ధరలే కలిగి ఉండొచ్చు అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయినా సరే అమెరికా డీడీజీఎస్ లనే పాడి రైతులు కొనే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమెరికా డీడీజీఎస్ లు హయ్యర్ క్వాలిటీతో ఉంటాయంటున్నారు. ఇందులో లో-లెవల్ ఆఫ్ అఫ్లో టాక్సిన్ (ఫంగస్) ఉండటం వల్ల రిజల్ట్ బెటర్ గా ఉంటుంది. అప్పుడు ఇండియన్ రైతులు ధర ఎక్కువైనా సరే రైతులు ఈ అమెరికా డీడీజీఎస్ లనే కొనే ఛాన్స్ లేకపోలేదు.
రైతులకు భారీ నష్టం..?
అమెరికన్ డీడీజీఎస్ లనే పాడి రైతులు, కోళ్ల ఫారాల్లో, ఫిష్ ఫీడింగ్ కోసం వాడితే.. అప్పుడు ఇండియన్ డీడీజీఎస్ లు చాలా నష్టపోతాయి. ఆ ఎఫెక్ట్ మొక్కజొన్న రైతులు, వరి, సోయా రైతులపై కూడా పడుతుంది. ఎందుకంటే ఇండియన్ డీడీజీఎస్ కంపెనీలు మక్కలు, వరి, సోయాలతోనే ఇథనాల్ ప్రొడక్ట్ ను తయారు చేస్తున్నాయి. కాబట్టి ఇండియన్ డీడీజీఎస్ కంపెనీలు నష్టపోతే.. మన రైతుల దగ్గరి నుంచి ఉత్పత్తులు కొనడం తగ్గిస్తాయి. అప్పుడు రైతుల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గి.. మరింత నష్టపోతారని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ వాదన..
ఇక్కడ ఇండియన్ ప్రభుత్వం చెబుతోంది ఏంటంటే.. ఇప్పుడు అమెరికా డీడీజీఎస్ లను కొద్ది మొత్తంలో మాత్రమే మనం దిగుమతి చేసుకుంటున్నాం. దాని వల్ల మన డీడీజీఎస్ రంగానికి ఎలాంటి నష్టం ఉండదు అంటున్నారు. కానీ ఇప్పుడు కొద్ది మొత్తంలో మొదలైనా.. తర్వాత అదే పెద్ద మొత్తంగా మారుతుందంటున్నారు. ఎందుకంటే ట్రేడ్ డీల్ లో (India US Trade Deal) ఈ డీడీజీఎస్ ల కొనుగోళ్లు టారిఫ్ బారియర్ లోకి వస్తాయి. అంటే అమెరికా డీడీజీఎస్ లపై ఇండియన్ గవర్నమెంట్ ఆంక్షలు పెడితే.. అప్పుడు టారిఫ్ లను మళ్లీ పెంచుతాం అనేది ట్రంప్ కండీషన్. కాబట్టి రానున్న రోజుల్లో యూఎస్ డీడీజీఎస్ ల దిగుమతులు మరింత పెరగొచ్చు.
Read Also: కులానికి బహిష్కరణ.. ఓ పల్లెటూరు ఆదర్శ తీర్మానం
Follow Us On: Pinterest


