కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ముడి చమురుపై (Crude Oil) తీవ్ర ఆందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. అయితే భారత్ తో (India) పాటు ఇతర దేశాలకు ముడి చమురును ఆపబోమని.. అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు యూరప్ దేశాలకు ఆపేస్తామని నిన్న ఇరాన్ తెలిపింది. కానీ అది ఎంత వరకు సాధ్యం అనేది తెలియరాలేదు. ఈ క్రమంలోనే ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా ఇండియాకు దిగుమతులను 60 శాతం నుంచి 70 శాతానికి పెంచింది భారత్. అంటే గల్ఫ్ దేశాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసే ఆయిల్ ను ఇలా పెంచింది. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. భారత్ వద్ద 25 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు రెడీగా ఉంటున్నాయి. దాన్ని పెంచడానికి ఈ దిగుమతుల పర్సెంటేజీ పెంచడం కూడా కలిసొస్తుందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. అటు ట్రంప్ (Trump) కూడా రష్యా నుంచి భారత్ 30 రోజుల పాటు ఆయిల్ కొనుగోలు చేయొచ్చన్నారు. ఇవన్నీ భారత్ కు ఆయిల్ నిల్వలు (Crude Oil) పెంచుకోడానికి ఉపయోగపడుతాయి. కాబట్టి ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్ లేదంటున్నారు.
Read Also: మహిళలకు నెలకు రూ.2500, ఉచిత గ్యాస్ సిలిండర్లు : విజయ్
Follow Us On: Instagram

