కలం, వెబ్ డెస్క్ : ఇరాన్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందం అతి త్వరలోనే ముగింపు దశకు చేరుకోనుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Trump) ప్రకటించారు. బహుశా ఈ వారాంతంలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పంద నిబంధనలకు ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ ఆమోదం తెలిపారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడి నుంచి సానుకూల స్పందన లభించిందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్‌పై ఉన్న ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను అమెరికా తక్షణమే ఎత్తివేస్తుందని ఆయన ధృవీకరించారు. ఆంక్షల తొలగింపు అనేది ఈ శాంతి ఒప్పందంలో ఒక ముఖ్యమైన భాగమని వివరించారు. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనమవుతాయని, చమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడం ఖాయమని ట్రంప్ (Trump) ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: రేపటి నుంచి వారం రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన
Follow Us On: X(Twitter)

