ఇన్సూరెన్స్ లేకపోతే రూ.10 వేలు ఫైన్.. NHAI క్లారిటీ!

కలం, వెబ్ డెస్క్: వాహనాలకు ఇన్సూరెన్స్ విషయంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI ) స్పష్టత ఇచ్చింది. చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారంటూ వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చింది. ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వాహనాలకు ఎలాంటి చలాన్లు విధించబోమని వెల్లడించింది. కేవలం వాహన యజమానులకు SMS ద్వారా అలర్ట్ సందేశాలు మాత్రమే పంపిస్తామని స్పష్టం చేసింది.

ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టు..

ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించి, యజమానులను అప్రమత్తం చేసేందుకు NHAI ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II పై ఉన్న ముండ్కా టోల్ ప్లాజా వద్ద ఈ విధానం అమలవుతోంది. టోల్ ప్లాజా దాటే సమయంలో వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లు గుర్తిస్తే యజమాని మొబైల్‌కు SMS ద్వారా సందేశం పంపిస్తారు.

జరిమానాలపై స్పష్టత..

ఇన్సూరెన్స్ లేని వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి జరిమానాలు లేదా చలాన్లు విధించే విధానం లేదని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కేవలం వాహనదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీలను సకాలంలో పునరుద్ధరించుకునేలా అవగాహన కల్పించడమే ఈ పైలట్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేసింది.

Also Read : తమిళనాడులో విషాదం: వంద అడుగుల లోయలో పడిన మినీ బస్సు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>