దివ్యాంగులకు ఎలక్ట్రిక్ సైకిళ్లు అందజేసిన గంగుల కమలాకర్

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) నియోజకవర్గంలోని నిరుపేద దివ్యాంగులకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) తన సొంత డబ్బులతో ఎలక్ట్రిక్ మూడు చక్రాల సైకిళ్లను అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో తమకు అవసరమైన వాహనాలను కొనుగోలు చేయలేని దివ్యాంగులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆయన వ్యక్తిగతంగా నిధులు వెచ్చించి ఈ సైకిళ్లను సమకూర్చినట్లు తెలిపారు.

కరీంనగర్‌లోని తన నివాసంలో శివ కిషోర్, మాధవి, లచ్చయ్య, పోచమల్లు, శివలకు ఎలక్ట్రికల్ మూడు చక్రాల సైకిళ్లను గంగుల కమలాకర్ అందజేశారు. దివ్యాంగులు తమ రోజువారీ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా ప్రయాణించేందుకు, స్వతంత్రంగా తమ పనులు చేసుకునేందుకు ఈ సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రాకపోకల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి, తమ జీవన గమనాన్ని మరింత సులభతరం చేసుకునేందుకు ఈ వాహనాలు దోహదపడనున్నాయి.

ఎలక్ట్రికల్ మూడు చక్రాల సైకిళ్లు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రయాణ కష్టాలు తగ్గడంతో పాటు నిత్యజీవితంలో ఎంతో వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>