కలం, వెబ్‌డెస్క్: శిరోమణి అకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal) పై కత్తులతో దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయనతో పాటు ఆయన సెక్యూరిటీకి కూడా గాయాలయ్యాయి. నిహంగ్ గ్రూప్‌నకు చెందిన వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
నాందేడ్‌లోని మాతా సాహెబ్ కౌర్ ప్రాంతంలో ఓ గురుద్వారా వద్ద ఈ ఘటన జరిగింది. దాడిలో సుఖ్‌బీర్ సింగ్ కుడి చేతికి స్వల్ప గాయమైంది. వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. సుఖ్ బీర్ సింగ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు వెల్లడించారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

