Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్నికల సంఘంపై సీజేఐకి ఇండియా కూటమి ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై ఇండియా కూటమి (India Alliance) పార్టీలు మరోసారి తీవ్ర అభ్యంతరం చేశాయి. ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగిస్తోందని, దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు లేఖ రాశాయి. ఇది నేరుగా ప్రజాస్వామ్య వ్యవస్థపైనే దాడిగా పరిగణించాలని విన్నవించాయి.

ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టి, తగిన న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాయి. సీజేఐకి రాసిన లేఖపై 23 పార్టీలు సంతకం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేర్కొన్నారు. జూన్ 8న జరిగిన సమావేశంలో నిర్ణయించిన మేరకు లేఖ రాసినట్లు వివరించారు.

డీఎంకే, ఆప్ పార్టీలతో సంప్రదింపులు..

సీజేఐకి రాసే లేఖపై సంతకం చేయాలని కాంగ్రెస్ పార్టీ డీఎంకే, ఆప్ పార్టీలను తొలుత సంప్రదించగా.. అవి తిరస్కరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మరోసారి చొరవ తీసుకుని మాట్లాడటంతో సంతకం పెట్టేందుకు అంగీకరించాయి. దేశ సమస్యలపై పార్టీలకు అతీతంగా ఒకే తాటిపై ఉండాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్షాల ఐక్యత ఇలాగే కొనసాగుతూ ఉండాలని టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>