గద్వాల రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దు: డీకే స్నిగ్ధ రెడ్డి

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల పట్టణంలో రెండో రైల్వే గేటు వద్ద ఆర్‌ఓబీ (Gadwal ROB) నిర్మిస్తారని వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, 80 ఫీట్ల రోడ్డు ఉన్నచోటే ఆర్‌ఓబీ నిర్మాణం జరుగుతుందని బీజేపీ యువ నాయకురాలు డీకే స్నిగ్ధ రెడ్డి స్పష్టం చేశారు. గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

​మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆదేశాల మేరకు, రైల్వే శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల (జీవో) ప్రకారం కిలోమీటర్ 186/6-7 వద్ద గల 80 అడుగుల రోడ్డులోనే నూతన ఆర్‌ఓబీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. పాత రికార్డుల కారణంగా కొంత అయోమయం తలెత్తిందని, అయితే క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా ఆ స్థలమే సరైనదని రైల్వే శాఖ స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో రెండో రైల్వే గేటు పరిసర ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆర్‌ఓబీ నిర్మాణంపై రైల్వే శాఖ ప్రకటన మాత్రమే తుది నిర్ణయమని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, గద్వాల అసెంబ్లీ నాయకులు బలిగేరా శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, BJYM జిల్లా అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, దేవదాస్, కౌన్సిలర్ చంద్రశేఖర్, మహిళా మోర్చా నాయకురాళ్లు సంధ్య, భారతి, సీనియర్ నాయకులు మీర్జాపురం వెంకటేశ్వరరెడ్డి, మధు గౌడ్, నరసింహశెట్టి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>