కలం, స్పోర్ట్స్: మాంచెస్టర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ (IND vs BAN) మరోసారి తన సత్తా చూపింది. బౌలింగ్‌లో భారత మహిళా బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. రాధా యాదవ్ అయితే బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించేశారు. 4 ఓవర్ల బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేయడమే కాకుండా 3 వికెట్లు పడగొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ మహిళల జట్టు 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు (IND vs BAN) ఓపెనర్లు ఆశించిన ఆరంభాన్ని అందించలేదు. డిలారా అక్తెర్ 4 పరుగులకే పెవిలియ్ బాటపట్టారు. అయితే మరో ఓపెనర్ జువైరియా ఫెర్దౌస్ (33 పరుగులు, 31 బంతులు, 5 ఫోర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకోగా, కెప్టెన్ నిగర్ సుల్తానా (32 పరుగులు, 27 బంతులు, 4 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. శోభన మోస్తరి 22 పరుగులతో వీరికి సహకారం అందించింది. చివర్లో షోర్నా అక్తెర్ 13 పరుగులు జోడించడంతో బంగ్లాదేశ్ ఈ స్థాయి స్కోరైనా చేయగలిగింది.
భారత బౌలర్లలో రాధా యాదవ్ 28 పరుగులిచ్చి 3 వికెట్లతో టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచారు. శ్రీ చరణి తన 3.6 ఓవర్లలో 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా, రేణుక సింగ్, నందని శర్మ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. దీప్తి శర్మ వికెట్ తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చారు. బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు పూర్తిస్థాయిలో సఫలమయ్యారు. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న భారత జట్టుకు ఈ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

