Mobile Popup Ad
Mobile Popup Ad

గోపాలపురం చెరువు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

కలం, వరంగల్ బ్యూరో: అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. హనుమకొండ (Hanumakonda) జిల్లాలోని గోపాలపురం (Gopalapuram) చెరువు ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. పోలీస్ బందోబస్తు మధ్య రెవిన్యూ , మున్సిపల్ అధికారులు సుమారు 100 గుడిసెలు కూల్చివేశారు.

అక్కడ నివాసం ఉంటున్న వారిని ముందే ఖాళీ చేయించారు. అనంతరం జేసీబీలతో నిర్మాణాలను తొలగించారు. గత ఏడాది వర్షాలకు గోపాలపురం, 100 ఫీట్ల రోడ్డు ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>