హైదరాబాద్‌లో దారుణం.. కుక్కల రక్తంతో వ్యాపారం!

కలం, వెబ్‌డెస్క్: డబ్బు కోసం కుక్కల రక్తాన్ని అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్న అమానుష ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని షేక్ పేటలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. షేక్ పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వాహకులు కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్నారు. అయితే అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే పెంపుడు కుక్కలే లక్ష్యంగా ఆసుపత్రి నిర్వాహకులు వ్యాపారం సాగిస్తున్నారని, ప్యాకెట్ రక్తం రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్ముకుంటున్నారని జంతు ప్రేమికులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా చికిత్స, సంరక్షణ పేరుతో ఆసుపత్రి సిబ్బంది వీధి కుక్కలను ఆసుపత్రికి తీసుకువచ్చి పెంచుతున్నారు. అనంతరం వాటి రక్తాన్ని అమ్ముకుని వ్యాపారం సాగిస్తున్నారు.

అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే పెంపుడు కుక్కలకు అవసరం లేకున్నా రక్త పరీక్షలు చేసి రక్తహీనత ఉన్నట్లు ఫేక్ రిపోర్టులు ఇస్తున్నారు. అనంతరం ఆ రిపోర్టులను యజమానికి చూపించి రక్తం ఎక్కిస్తామని చెప్తున్నారు. తర్వాత ఆసుపత్రిలో పెంచుతున్న పెంపుడు కుక్కలను చూపించి వాటి రక్తాన్ని ఎక్కిస్తామని చెప్తారు. ఈ రకంగా ప్యాకెట్ రక్తాన్ని రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉన్న వీధికుక్కలు కూడా రక్తహీనతతో చనిపోతున్నాయని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>