Mobile Popup Ad
Mobile Popup Ad

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్: సిమ్ తీసుకుంటే పెట్రోల్ ఫ్రీ

కలం, వెబ్ డెస్క్‌ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఒక ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎయిర్టెల్ సిబ్బంది ఒక వినూత్నమైన ఆఫర్‌ (Airtel Offer)ను తెరపైకి తెచ్చారు. స్థానికంగా నెలకొన్న పెట్రోల్ డిమాండ్‌ను వారు తెలివిగా తమ వ్యాపార వృద్ధికి వాడుకుంటున్నారు. ఎవరైనా తమ పాత నెట్‌వర్క్ నుండి ఎయిర్టెల్ లోకి పోర్ట్ అయ్యి మూడు వందల యాభై రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే వారికి ఉచితంగా ఒక లీటర్ పెట్రోల్ అందజేస్తామని (Free Petrol) ప్రకటించారు. ఈ బంపర్ ఆఫర్ గురించి తెలుసుకున్న వాహనదారులు భారీగా తరలివస్తున్నారు. పెట్రోల్ ధరలు సామాన్యుడికి భారంగా మారిన తరుణంలో ఇలాంటి ఆఫర్ లభించడంతో కొత్త సిమ్ తీసుకోవడానికి ప్రజలు ఎగబడుతున్నారు. సిబ్బంది వ్యూహం ఫలించి ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి మారేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>