బుద్ధవనం సందర్శన దివ్యమైన అనుభూతి: అన్షుమాన్

కలం, నాగార్జునసాగర్: జీవితంలో మర్చిపోలేని దివ్యమైన అనుభూతులలో ఒక ప్రదేశముగా నాగార్జునసాగర్ లోని బుద్ధవనం సందర్శన నిలుస్తుందని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అన్షు మాన్ (Patna High Court Judge Anshuman) అన్నారు. నాగార్జునసాగర్ సందర్శనలో భాగంగా కుటుంబ సమేతంగా శుక్రవారం నాగార్జునసాగర్ లోని విజయ విహార్ అతిధి గృహానికి చేరుకోగా ప్రోటోకాల్ ఆఫీసర్ దండా శ్రీనివాస్ రెడ్డి, నిడమనూరు కోర్టు సూపర్డెంట్ తిరుమలేష్ లు న్యాయమూర్తికి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం వీరు నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ ను, బుద్ధవనాన్ని (Buddhavanam) సందర్శించారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధ చరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ధ్యానవనం, స్తూపవనాలను సందర్శించి మహాస్తూపంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలు తెలియజేసే లఘు చిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలోని బుద్ధుని విగ్రహం వద్ద బుద్ధ జ్యోతులను వెలిగించారు.

ఈ సందర్భంగా బుద్దవనం అధికారులు శాసన, రవిచంద్రలు న్యాయమూర్తి దంపతులను బుద్ధవనం కండువాలతో, బ్రోచర్లతో సత్కరించారు. అనంతరం కొద్దిసేపు ధ్యానం చేశారు.వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ వివరాలను, బుద్ధవనం విశేషాలను వివరించారు. వీరితోపాటు స్థానిక ఎస్ ఐ సతీష్ , నిడమనూరు కోర్టు సిబ్బంది ఖాళీక్ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>