Mobile Popup Ad
Mobile Popup Ad

‘మళ్ళీ పైరసీ జోలికి వెళ్లను’.. పోలీస్ కస్టడీలో ఇమ్మడి రవి

పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి(iBomma Ravi)ని పోలీసులు విచారిస్తున్నారు. వారి విచారణలో తాను మారిపోతానని రవి చెప్పినట్లు తెలుస్తోంది. మరోసారి పైరసీ(Piracy) జోలికి వెళ్లనని, తన తప్పు తెలుసుకుననానని అన్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా పోలీసుల విచారణలో మరిన్ని కీలక విషయాలను రవి వెల్లడించాడు. ఆరేళ్లపాటు నన్నెవరూ పట్టుకోలేకపోయారు.. అదే ధీమాతో నెట్ వర్క్ పెంచుకున్నానని తెలిపాడని, డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే పరసీని మొదలు పెట్టానని తెలిపినట్లు సమాచారం. చేస్తున్న సమయంలో దీనిని తప్పని గుర్తించలేక పోయానని, ఇప్పుడే తాను ఎంత తప్పు చేశారో అర్థమైందని పేర్కొన్నాడట. తాను చేసిన తప్పుకు చాలా పశ్చాత్తాప పడుతున్నానని, మరోసారి పైరసీ జోలికి వెళ్లలని అంటున్నాడని తెలుస్తోంది. ‘‘జైలు నుండి బయటకు వచ్చాక పూర్తిగా మారిపోతా.. పైరసీ జోలికి వెళ్లను’ అని కస్టడీలో పోలీసులతో ఐబొమ్మ రవి(iBomma Ravi) ప్రాధేయపడినట్లు సమాచారం.

Read Also: అలాంటి పాత్రలకు నో చెప్పేస్తా: రాశీ

Follow Us On : Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>