కివీస్‌తో వన్డే సిరీస్.. రోకోనే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌!

కలం, స్పోర్ట్స్ : మైదానంలోకి దిగేది టీమిండియా.. కానీ అభిమానుల కళ్లు మాత్రం ఆ ఇద్దరిపైనే. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ.. రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లీ (Rohit – Kohli). ఈ ఇద్దరు దిగ్గజాల ఆటే ఇప్పుడు భారత్‌–న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. ఆస్ట్రేలియా గడ్డపై ఘనంగా వీడ్కోలు అందుకున్న రోకో జోడీ.. న్యూజిలాండ్‌లోనూ అదే జోరు చూపిస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. నవంబర్‌ 4న ఆక్లాండ్‌లో తొలి వన్డే జరగనుంది. 2018-19 తర్వాత భారత్‌ ఆడుతున్న తొలి ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ ఇదే కావడం విశేషం.

కోహ్లీ భీకర ఫామ్‌.. రోహిత్‌పై అంచనాలు!

ఈ ఏడాది వన్డేల్లో కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో మూడు అర్ధసెంచరీలు, రెండు సెంచరీలు సాధించాడు. 117.94 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా పరుగులు చేస్తున్నాడు. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ 93, 23, 124 పరుగులు చేశాడు.

మరోవైపు రోహిత్‌ తనదైన శైలిలో జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలని చూస్తున్నాడు. గతంలో దూకుడుగా ఆడిన హిట్‌మ్యాన్‌.. ఇప్పుడు నిలకడపైనా దృష్టి పెడుతున్నాడు. న్యూజిలాండ్‌ పిచ్‌లపై బంతి వేగంగా, ఎక్కువ బౌన్స్‌తో రావడం అతడికి సవాల్‌ కానుంది.

గాయాలతో ఇరు జట్లకు ఇబ్బందులు!

భారత్‌కు పేసర్ల కొరత వేధిస్తోంది. హర్షిత్‌ రాణా, ప్రసిద్ధ్‌ కృష్ణ కోలుకుంటుండగా.. బుమ్రా కూడా ఈ పర్యటనలో లేడు. దీంతో సిరాజ్‌, అర్ష్‌దీప్‌, అన్షుల్‌ కాంబోజ్‌, గుర్నూర్‌ బ్రార్‌పై బాధ్యత పెరిగింది.

న్యూజిలాండ్‌ పరిస్థితీ అంతే. కాన్వే తొలి వన్డేకు దూరమయ్యాడు. రాచిన్‌ రవీంద్ర, మార్క్‌ చాప్‌మన్‌, జాక్‌ ఫౌల్క్స్‌, విల్‌ ఓ రూర్క్‌ గాయాల నుంచి కోలుకుంటున్నారు. మాట్‌ హెన్రీ అందుబాటుపైనా స్పష్టత రావాల్సి ఉంది.

కివీస్‌ను తక్కువ అంచనా వేయొద్దు!

చివరి రెండు టీ20ల్లో గెలిచిన న్యూజిలాండ్‌ మంచి ఊపులో ఉంది. గ్లెన్‌ ఫిలిప్స్‌, టిమ్‌ సీఫర్ట్‌, డారిల్‌ మిచెల్‌ ఫామ్‌లో ఉన్నారు. శాంట్నర్‌ కూడా కీలక ఆటగాడు. గాయాలు వేధిస్తున్నా ఆతిథ్య జట్టును తక్కువగా చూడలేం.

ఆక్లాండ్‌లో బౌన్స్‌.. గాలుల ప్రభావం!

తొలి వన్డేకు బౌన్స్‌ ఉండే పిచ్‌ సిద్ధమవుతుందని అంచనా. బలమైన గాలులు కూడా ఆటపై ప్రభావం చూపవచ్చు. నేరుగా ఉన్న బౌండరీలు చిన్నవిగా ఉండటంతో బ్యాటర్లకు అవకాశాలుంటాయి. పిచ్‌ను బట్టి 270 నుంచి 310 పరుగుల స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.

గిల్‌ వ్యూహం.. శాంట్నర్‌ హెచ్చరిక!

మధ్య ఓవర్లలో వికెట్లు తీయడమే తమ పేస్‌ బౌలింగ్‌ వ్యూహమని భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తెలిపాడు. వేగం, బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల బౌలర్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించాడు. కోహ్లీ, గిల్‌ భారత బ్యాటింగ్‌కు కీలకమని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ పేర్కొన్నాడు. ఒత్తిడి పెంచి వికెట్లు తీయడమే తమ లక్ష్యమని తెలిపాడు.

భారత్‌ అంచనా జట్టు:

రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), నామన్‌ ధీర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, గుర్నూర్‌ బ్రార్‌, మహమ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

టీ20ల తర్వాత వన్డే సమరానికి సిద్ధమైన భారత్‌కు ఈ సిరీస్‌ కీలకం. అయితే ఫలితంతో పాటు అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్నది మాత్రం రోహిత్‌, కోహ్లీ (Rohit – Kohli) బ్యాటింగ్‌ విన్యాసాల కోసమే. న్యూజిలాండ్‌ గడ్డపై ఈ ఇద్దరు దిగ్గజాలు ఎలా రాణిస్తారో చూడాలి.

Also Read : అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ స్టార్ ప్లేయర్ రిటైర్‌మెంట్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>