రేపటి నుంచి డీడీఓలకు మూడు రోజుల శిక్షణ

కలం, నిర్మల్‌ : ప్రభుత్వ పాలనలో డిజిటల్‌ సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌ (eHRMS Training), ఈ-శాంక్షన్స్‌, వామిస్‌ (WAMIS) విధానాలపై డీడీఓలకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బుధవారం నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని జిల్లా ఖజానా శాఖ అధికారి సరోజ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మొదటి రోజు జిల్లా అధికారులు శిక్షణకు హాజరుకావాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, ఆర్థిక అనుమతులు, ఇతర పరిపాలనా కార్యకలాపాలను డిజిటల్‌ విధానంలో నిర్వహించడంపై ఈ శిక్షణలో అవగాహన కల్పించనున్నట్టు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>