హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు కాంచీపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇరుంగట్టుకొట్టాయ్‌లో ఉన్న హ్యుందాయ్ (Hyundai Fire Accident) మోబిస్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాలను కమ్మేసిన దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటల్లో కార్లు, సామాగ్రి దగ్ధం అయ్యాయి. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.

Read Also: హైదరాబాద్‌లో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా.. ట్యాంక్ బండ్ వద్ద లాఠీచార్జ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>