కలం, నిర్మల్: భారతీయ జనతా పార్టీలో నిర్మల్ జిల్లా నాయకుడు కొండాజీ నరేంద్ర చారికి కీలక బాధ్యతలు దక్కాయి. బీజేపీ ఓబీసీ మోర్చా మంచిర్యాల (Mancherial) జిల్లా ఇన్‌చార్జిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కొండాజీ నరేంద్ర చారిని నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచనల మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ శుక్రవారం నియామకాలను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నరేంద్ర చారి తెలిపారు. ఈ బాధ్యతలతో మంచిర్యాల జిల్లాలో పార్టీ విస్తరణకు మరింత వేగం చేకూరుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

