Mobile Popup Ad
Mobile Popup Ad

చౌటుప్పల్ ఫామ్‌హౌస్‌లో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

కలం, చౌటుప్పల్: వీకెండ్‌లో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫామ్‌హౌస్ పార్టీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చౌటుప్పల్ (Choutuppal) మండలం కొయ్యలగూడెం శివారులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొయ్యలగూడెం శివారులోని ఫామ్‌హౌస్‌ (Farmhouse)లో గెట్‌టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి మంచిర్యాల జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాండ్ల రాము (27) కూడా హాజరయ్యాడు. అందరూ కలిసి వేడుక చేసుకుంటుండగా, రాము అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.

యువకుడి మృతిపై సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పార్టీలో పాల్గొన్న మిగిలిన ఉద్యోగులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటన సమయంలో ఏం జరిగిందనే కోణంలో వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. మితిమీరిన మద్యం మత్తే మరణానికి కారణమా? లేక ఇందులో ఏదైనా విష ప్రయోగం లేదా ఇతర కుట్ర కోణాలు ఉన్నాయా? అనే అనుమానాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. “పోస్టుమార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు వస్తేనే రాము మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయి” అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ఫామ్‌హౌస్ పార్టీల సంస్కృతి, అక్కడ జరుగుతున్న విందులు, భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. దీంతో చౌటుప్పల్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>