గణేష్ ఉత్సవాల్లో షీ టీమ్స్ నిఘా.. పోలీసుల అదుపులో 1530 మంది

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన ఉత్సవాల (Ganesh Festival) సందర్భంగా మహిళలు, యువతుల భద్రత కోసం నగర పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, అడిషనల్ పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఆదేశాల మేరకు సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 23 వరకు ఖైరతాబాద్, బాలాపూర్ తదితర గణేష్ మండపాల వద్ద షీ టీమ్స్‌ (She Teams)ను విస్తృతంగా మోహరించారు. ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, అభ్యంతరకర చేష్టలను అరికట్టేందుకు రద్దీ ప్రాంతాల్లో, నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్​ ప్రత్యేక నిఘా కొనసాగించాయి.

ఈ క్రమంలో ఈవ్ టీజింగ్, ఇతర అభ్యంతరకర కార్యకలాపాలకు పాల్పడిన 1,530 మంది పోకీలను షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్​ అడిషనల్ కమిషనర్​ ఎం.శ్రీనివాసులు వెల్లడించారు. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టగా, 48 మందికి శిక్ష పడినట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాల సమయంలో మహిళలు, యువతుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ షీ టీమ్స్ (She Teams) నిరంతరం నిఘా కొనసాగించినట్లు సీపీ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>