ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టిన కారు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం (Hyderabad Road Accident) చోటు చేసుకుంది. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన ఓ కారు అత్యంత వేగంగా ఢీ కొట్టింది. బస్టాఫ్ దగ్గర ప్రయాణికులు బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారు ఇంజన్ భాగం పూర్తిగా నలిగిపోయి పూర్తిగా నుజ్జునుజ్జుయ్యింది.

ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమా? డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? బ్రేకులు ఫెయిల్ అయ్యాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: పన్ను కట్టని పరిశ్రమలు, స్కూళ్లపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>