Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌ పోలీస్ ఆధ్వర్యంలో మహిళా భద్రత కార్యక్రమాలు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనరేట్ (Hyderabad Police) పరిధిలో పోలీసులు రాష్ట్ర స్థాయి మహిళా భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ప్రచారంలో భాగంగా మహిళా భద్రతా విభాగం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డీపీసీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ (DCP), ఏహెచ్‌టీయూ (AHTU) & జేబీ (JB) యూనిట్ ఏసీపీల ప్రత్యక్ష పర్యవేక్షణలో బోరబండ బస్తీ, రహ్మత్ నగర్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, చౌమహల్లా ప్యాలెస్ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు.

సైబర్ నేరాలపై అవగాహన..

ఈ సందర్భంగా లింగ సమానత్వం, బాలల భద్రత, మహిళలు, బాలలపై జరుగుతున్న వివిధ రకాల హింసల వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. వీటితో పాటు సైబర్ నేరాల పట్ల, సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల పోలీసుల బృందం ప్రజలకు వివరించింది. అలాగే మానవ అక్రమ రవాణా వల్ల కలిగే ప్రమాదాలు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఎలాంటి భయం లేకుండా సంఘటనలపై ఫిర్యాదు చేయాలని కోరారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లయిన పోలీస్ అత్యవసర సేవలు 100 / 112 లను, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098.. మొదలైన వాటి గురించి ప్రజలకు వివరించారు. ఏ సమయంలోనైనా ఫోన్ చేసి సహాయం పొందవచ్చని.. ఎలాంటి భయం లేకుండా కాల్ చేయాలని సూచించారు.

Read Also: నీ సంగతి చూస్తా.. కిషన్​ రెడ్డికి సీఎం వార్నింగ్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>