Mobile Popup Ad
Mobile Popup Ad

ORRపై పోలీసుల కాల్పులు.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad ORR) కాల్పులతో ఉలిక్కిపడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఒక నేరస్థుడిని నల్గొండ పోలీసులు సినీ ఫక్కీలో చేజ్ చేసి పట్టుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు తీవ్రంగా ప్రయత్నించడంతో, అధికారులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్నట్లు నల్గొండ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అయితే ఎగ్జిట్ నంబర్ 8, ఎగ్జిట్ నంబర్ 12 మధ్య ప్రాంతంలో పోలీసులను గమనించిన సదరు నేరస్థుడు, వారి నుంచి తప్పించుకోవడానికి సినిమా తరహాలో పారిపోయే ప్రయత్నం చేశాడు.

నిందితుడు ఎంతకీ లొంగకపోవడం, పారిపోవడానికి ప్రయత్నించడంతో, పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాయపడిన క్రిమినల్‌ను అదుపులోకి తీసుకుని, చికిత్స నిమిత్తం వనస్థలిపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ భారీ చేజింగ్, కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>