హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..

కలం, వెబ్​ డెస్క్​: హైదరాబాద్​ నగరంలో పలుచోట్ల భారీ వర్షం (Hyderabad Heavy Rain) కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నానక్‌రాంగూడ, మణికొండ, షేక్‌పేట్‌, టోలిచౌకీ, రాజేంద్రనగర్‌, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం దంచికొడుతోంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో నగరం ఒక్కసారిగా చల్లబడింది. ఆఫీసుల లాగ్​ అవుట్​ సమయం అవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావం కారణంగా తెలంగాణలో వాతావరణం మారిపోయింది. అక్టోబర్​ 30 నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్​ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​ నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు వానలు (Hyderabad Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>