Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌లో టిప్పర్ లారీ బీభత్సం.. నుజ్జునుజ్జైన కారు..!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ (Hyderabad Road Accident)లో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. హయత్‌నగర్ డిపో సమీపంలో విజయవాడ హైవేలోని భాగ్యలత – హయత్‌నగర్ మార్గంలో ముందు వెళ్తున్న కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయింది. కారులోని ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంతో హయత్‌నగర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టిప్పర్ లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>