కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో (Gudimalkapur Fire Accident ) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొఘల్‌కానాల సమీపంలోని ఓ ఫర్నిచర్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
గోడౌన్‌లో ఫర్నిచర్ సామగ్రి పెద్దమొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

