శర్వానంద్ ‘భోగి’ విడుదల వాయిదా?: కారణం ఇదే!

క‌లం, సినిమా: డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ (Sharwanand Bhogi) సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. సెన్సార్ ప్రక్రియలో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఈ చిత్రాన్ని ‘రివైజింగ్ కమిటీ’ కి పంపినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమా న‌వంబ‌ర్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయంతో విడుదల తేదీలో మార్పు ఉండనుంది. రివైజింగ్ కమిటీ సినిమాను పరిశీలించి తమ తుది నిర్ణయాన్ని, సర్టిఫికేషన్ వివరాలను వెల్లడించిన తర్వాతే చిత్ర బృందం కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనుంది.

అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ విడుదలతో పాటు ఈవెంట్ కూడా ఇప్పటికే వాయిదా పడింది. శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటించిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘శ‌త‌మానం భ‌వ‌తి’ వంటి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్, అనుపమ మరోసారి జతకట్టడం.. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇలాంటి సమయంలో సినిమా విడుదల వాయిదా వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>