హైదరాబాద్‌లో దీపావళి ప్రభావం.. పెరిగిన వాయు కాలుష్యం

కలం, వెబ్ డెస్క్: దీపావళి పండుగ ప్రభావం హైదరాబాద్ నగరంపై స్పష్టంగా కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా నగర వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున బాణసంచా కాల్చడంతో వాయు కాలుష్యం (Hyderabad Air Pollution) ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా టపాసుల నుంచి వెలువడిన పొగ, దుమ్ము, హానికరమైన రసాయనాలు గాలిలో కలవడంతో నగరంలో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. ఫలితంగా హైదరాబాద్‌లో వాయు నాణ్యత సూచీ (AQI) 160 పాయింట్లుగా నమోదైంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏక్యూఐ 160గా నమోదవడం ఆందోళనకరమైన పరిస్థితి. ఈ స్థాయి కాలుష్యం ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కళ్ల మంట, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో (Hyderabad Air Pollution) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>