Mobile Popup Ad
Mobile Popup Ad

ఉరి వేసుకున్న భార్య .. వీడియో తీస్తూ సూచనలిచ్చిన భర్త !

కలం, వెబ్​ డెస్క్​ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్లముందే ఉరి వేసుకుంటుంటే కాపాడాల్సిన భర్త.. కిరాతకుడిగా మారి ఆమె మరణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన అమానుష ఘటన కడప (Kadapa) జిల్లాలో వెలుగుచూసింది. రాజంపేట (Rajampet) మండలం బోయినపల్లిలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్న శ్రీరామ్ అనే వ్యక్తి కృష్ణవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా కృష్ణవేణి ఆత్మహత్యకు సిద్ధపడింది.

ఆ సమయంలో భార్యను అడ్డుకోవాల్సిన భర్త శ్రీరామ్, అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఉరి ఎలా వేసుకోవాలో సూచనలు ఇస్తూ, ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తూ ఉండిపోయాడు. భయం వేసి కృష్ణవేణి ఉరి నుండి కిందకు దిగేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే చీర మెడకు గట్టిగా బిగుసుకుపోవడంతో ఆమె క్షణాల్లో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఈ దారుణం వెనుక ఉన్న పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Read Also: బ్రేకప్ నుంచి ‘మూవ్ ఆన్’ అవ్వడం ఎలా..?

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>