జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

కలం, జోగులాంబ గద్వాల: కర్ణాటక జలాశయాల నుంచి జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 2,25,000 క్యూసెక్కుల వరద రావడంతో డ్యాం అధికారులు 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 1,81,766 క్యూసెక్కులు బయటకు వదులుతుండగా.. విద్యుత్‌ ఉత్పత్తికి 30,559 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా 2,16,870 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేశారు. జూరాల పూర్తి నీటిమట్టం 318.518 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 318,02 మీటర్ల వద్ద ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.651 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>