ఈ నెల 12 నుంచి ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్రవ్యాప్త ఆందోళన

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రభుత్వ జనరల్ బోధన ఆసుపత్రులలో మెడికల్ కళాశాలలో, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని జిల్లా ఏరియా కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు (Contract Workers) కనీస వేతనం 26వేలకు పెంచాలని ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళన (Statewide Protest) చేపడుతున్నట్లు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ తెలిపారు.

కనీస వేతనం 26వేలకు పెంచాలని కాల పరిమితి ముగిసిన ప్రస్తుత ఏజెన్సీలను తక్షణమే రద్దు చేయాలని పండగ జాతీయ ఆర్జిత సెలవులు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధనకై ఈ నెల 12 నుంచి జరగబోయే రాష్ట్రవ్యాప్త ఆసుపత్రి కార్మికుల ఆందోళన నోటీసును సోమవారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికులు అందజేశారు. ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ పేరు సూపర్వైజర్ కార్మికుల జీతాల పెంపు పట్ల తక్షణమే స్పందించాలని కోరారు.

ప్రభుత్వాసుపత్రులలో మూడు సంవత్సరాల కాల వ్యవధితో ఏజెన్సీల విధానంలో ఎంపిక చేసి అమలు చేస్తున్నారని ప్రస్తుత ఏజెన్సీల కాల పరిమితి ముగిసి ఏడాదిన్నర దాదాపు 5 సంవత్సరాలు అవుతున్న పట్టించుకోవడంలేదని అన్నారు. మూడేళ్లకు ఒకసారి ఏజెన్సీలు మారినప్పుడే ఆస్పత్రి కార్మికులకు జీతాలు, ఆస్పత్రి పడకల సామర్థ్యం పెరుగుతాయని ప్రభుత్వం కాలయాపన చేత కార్మికులు తీవ్రమైన ఆర్థిక నష్టంతో పాటు మోయలేని పని భారానికి గురవుతున్నారని అన్నారు. ఇప్పటికే అనేక పర్యాయాలు జీతాల పెంపుకై ఏజెన్సీల రద్దుకై వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేశామని అన్నారు.

అక్టోబర్ 22న ఈనెల 12 నుంచి జరగబోయే రాష్ట్ర వ్యాప్త జరగబోయే ఆందోళన సంబంధించిన సమ్మె నోటీసులు డీఎంఈ, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ శాఖ ఉన్నతాధికారులకి అందజేయడం జరిగిందని కానీ నేటికీ కార్మికుల సమస్యలపై అధికారులు గానీ అటు ప్రభుత్వం కానీ స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కార్మికుల డిమాండ్లను పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టి ఆందోళనలను విరమింప చేసే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

12 నుండి జరగబోయే రాష్ట్రవ్యాప్త ఆసుపత్రి కార్మికుల ఆందోళనలో కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ నాయకులు కార్మికులు బి.చెన్నయ్య, మన్యం, రామకృష్ణ, అంజి, యాదయ్య, అంజలయ్య, వెంకటన్న, చంద్రకళ, జ్యోతి,వెంకటమ్మ కవిత నిర్మల చెంచు లక్ష్మమ్మ,తిరుపతమ్మ లక్ష్మి,జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>