కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు పశ్చిమాసియా పాలిట శాపంగా మారాయి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ (Iran) తాజాగా ప్రకటించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇచ్చిన హామీ ప్రకారం.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని నిన్నటి నుంచి తెరిచింది. అయితే, ట్రంప్ మాత్రం ఇరాన్ ఓడరేవుల చుట్టూ.. తన దిగ్బంధం కొనసాగుతుందని ప్రకటించడంతో టెహ్రాన్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. దీంతో, మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన మాటను అమెరికా నిలబెట్టుకోవడం లేదని.. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వివరించింది.
చమురు ధరలు మళ్లీ పెరుగుతాయా..?
హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు ధరలు 11 శాతం తగ్గాయి. తాజాగా, దీన్ని మళ్లీ మూసివేయడంతో ఇంధన ధరలకు రెక్కలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. IRGC అనుమతి పొందిన నౌకలే హర్మూజ్ నుంచి ప్రయాణించాలని షరతు పెట్టిన ఇరాన్ (Iran).. శత్రు దేశ నౌకలు వెళితే మాత్రం పేల్చివేస్తామని హెచ్చరించింది. ఓ వైపు శాంతి ప్రకటనలు, ఇరాన్ తో ఒప్పందాలు అంటూనే.. ట్రంప్ ఆడుతున్న ఈ ప్రమాదకర క్రీడతో పశ్చిమాసియాలో ప్రశాంత పరిస్థితులు ఇప్పట్లో నెలకొనేలా కనిపించడం లేదని విశ్లేషణలు వస్తున్నాయి.
Read Also: లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ గర్జన
Follow Us On: Instagram

