ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం: దొంగగా మారిన పోస్ట్ మాస్టర్!

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (Banswada Post Master) చైన్ స్నాచర్ అవతారం ఎత్తాడు. చాకచక్యంగా దొంగతనం చేసినా పోలీసుల సాంకేతిక నైపుణ్యాలతో అడ్డంగా దొరికిపోయాడు. బత్తుల మునీశ్వర్ అనే యువకుడు నసురుల్లాబాద్ మండలం దుర్కిలొ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. దుర్కి పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన సుమారు 12 లక్షలు సొంతానికి వాడుకున్నాడు. ఆన్‌లైన్ గేమింగ్ లో పోగొట్టుకున్నాడు.. బంధువుల వద్ద పదకొండున్నర లక్షలు డబ్బులు తీసుకుని పోస్ట్ ఆఫీస్ అధికారులకు తిరిగి చెల్లించాడు.

ఇంకా పోస్ట్ ఆఫీస్ కి బాకీ ఉన్న మిగత 42 వేలు చెల్లించటానికి దొంగగా మారాడు. బాన్సువాడ లో ఓ కిరాణా షాపు యజమాని బెజగం రమేశ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. రమేశ్ భార్య చనిపోవడం వల్ల అతను ఒకడే ఉంటాడు. అది గమనించిన మునీశ్వర్ మీ కిరాణ షాపులో మద్యం అమ్ముతున్నారు అంటూ తాను ఎక్సైజ్ కానిస్టేబుల్ అని ఇంటి లోపలకు వెళ్ళి హడావుడి చేశాడు. రమేశ్ ను క్రింద పడేసి మెడలోంచి 23 గ్రాముల బంగారు చైన్ ను లాక్కొని బైక్ పై పరార్ అయ్యాడు. మునీశ్వర్ ను 10 రోజుల క్రితమే అధికారులు సస్పెండ్ చేశారు. అంతకు ముందు మరో షాపులో ఆన్ లైన్ పేమెంట్ చేశాడు. దాంతో పాటు సిసి ఫుటేజ్ ఆధారంగా మునీశ్వర్ ను పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి 23 గ్రాముల బంగారు గొలుసు, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకునీ రిమాండ్ కు పంపినట్లు బాన్సువాడ డిఎస్పీ విఠల్ రెడ్డి వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>