కలం, ఆదిలాబాద్: కరీంనగర్ అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనింగ్) ఎన్.హరి ప్రసాద్ (Assistant Collector Hari Prasad) మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను (Collector Rajarshi Shah) ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు హరి ప్రసాద్ పూల మొక్కను అందజేశారు. జిల్లా పరిపాలన, పాలనాపరమైన అంశాలు, క్షేత్రస్థాయి శిక్షణ అనుభవాలపై ఇరువురూ చర్చించారు. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ప్రసాద్‌ను అభినందించిన జిల్లా కలెక్టర్, శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలందించే అధికారిగా రాణించాలని ఆకాంక్షించారు.

