Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు : డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

కలం, వరంగల్ బ్యూరో : ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి (Gogula Ranaprathap)  తెలిపారు. గురువారం బీజేపీ నాయకులు నర్సంపేట డిపో వద్ద బంద్‌లో పాల్గొన్న కార్మికులను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. ప్రభుత్వం అసలు సమస్యలను పక్కన పెట్టి కేబినెట్ సమావేశాల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. అలాగే గతంలో పీఆర్సీ విషయంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను గద్దెనెక్కిన తర్వాత విస్మరించిందని, రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా వాటిని అమలు చేయడం లేదని ఆయన (Gogula Ranaprathap) విమర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ సీనియర్ నాయకులు గడ్డం ఆంజనేయులు, కుంభం కోమల్ రెడ్డి, మల్యాల వినయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ గంగిడి మహేందర్ రెడ్డి, బీజేవైఎం నాయకులు జూలూరి మనీష్ గౌడ్, కొంకేస విగ్నేష్ గౌడ్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, ఆడెపు చందు, తప్పెట్ల సతీష్, చిలువేరు అన్వేష్, వేల్పుగొండ సుమన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Read Also: తెలంగాణ వాదుల క‌ల‌ల రాష్ట్రాన్ని సాధిస్తాం: క‌విత‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>