Mobile Popup Ad
Mobile Popup Ad

గ్యాస్ సిలిండ‌ర్ చోరీ.. పోలీసుల‌కు ఫిర్యాదు!

క‌లం, వెబ్ డెస్క్‌: దేశ వ్యాప్తంగా గ్యాస్ కొర‌త ఏర్ప‌డిన త‌రుణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏలూరు (Eluru)లో గ్యాస్ సిలిండ‌ర్ చోరీ (Gas Cylinder Theft)కి గుర‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జిల్లాలోని ద్వార‌కాతిరుమ‌ల (Dwaraka Tirumala) మండ‌లం కోడిగూడెంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కోడిగూడెంకు చెందిన శ్రీను శుక్ర‌వారం ప‌ని నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లారు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో కంపౌండ్ లోప‌ల ఉన్న గ్యాస్ సిలిండ‌ర్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఎత్తుకెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి వ‌చ్చి చూస్తే సిలిండ‌ర్ క‌నిపించ‌లేదు.

దీంతో బాధితుడు శ‌నివారం స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. గ్యాస్‌కు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయ‌ని, ఎలాగైనా త‌మ గ్యాస్ సిలిండ‌ర్ ఎవ‌రు ఎత్తుకెళ్లారో గుర్తించి త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరారు. రాష్ట్రంలో తీవ్ర గ్యాస్ కొర‌త వేధిస్తున్నందున ఎవ‌రైనా ముఠాగా మారి ఇలా గ్యాస్ సిలిండ‌ర్ల చోరీల‌కు పాల్ప‌డుతున్నారా? లేక స్థానికంగానే ఎవ‌రైనా సిలిండ‌ర్ ఎత్తుకెళ్లి ఉంటారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>