గ్రామస్తులపై తేనెటీగల దాడి!

క‌లం, మెద‌క్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా సదాశివపేట మండ‌లం వెంకటాపురం గ్రామంలో తేనెటీగల దాడి (Honey Bee Attack) గ్రామ‌స్తుల‌ను భ‌య‌భ్రంతుల‌కు గురి చేసింది. వెంక‌ట‌పురంలో శుక్ర‌వారం ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయ‌డంతో రోడ్డు పైన, బ‌య‌ట ఉన్న సుమారు 15 మంది తీవ్ర గాయాలపాల‌య్యారు. గాయపడ్డ వారిలో కొంత మందిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అంద‌రికీ అంబులెన్స్ సరిపోకపోవడంతో ఎవరికి వారే ఆసుపత్రి వైపు పరుగులు పెట్టారు. తేనెటీగల గుంపు దాడితో వెంక‌టాపురం గ్రామస్తులు ఒక్క‌సారిగా దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో సుధాక‌ర్ అనే యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

Read Also: బ్రేకప్ నుంచి ‘మూవ్ ఆన్’ అవ్వడం ఎలా..?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>