Mobile Popup Ad
Mobile Popup Ad

హోళీ వేళ విషాదం.. గోదావరిలో ఇద్దరు గల్లంతు

కలం/ఖమ్మం : బ్యూరో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని మణుగూరు మండలంలో హోళీ పండుగ నాడు విషాదం నెలకొంది. స్నానాలకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మణుగూరులోని సింగరేణి వాటర్ ట్యాంకు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగిన గుండి నాగేశ్వర రావు(40), పద్ధం ప్రసాద్(35)లు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపారు. గల్లంతైన వారు పద్మగూడెం గ్రామానికి చెందిన వారిగా.. పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Read Also: మరికాసేపట్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>