కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సాదు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలో ధర్మ పరిరక్షణ, ఆలయాల పవిత్రల, సనాతన ధర్మ పరిరక్షణ కోసం శనివారం హిందూగర్జన (Hindu Garjana) కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు రెండేళ్లు పేరుతొ నిర్వహించిన సదస్సులో వివిధ మఠాలకు చెందిన సాధువులు, స్వామీజీలు పాల్గొన్నారు.అయిదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరిగాయని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత హిందూ ధర్మాన్ని కాపాడుతోందని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద అన్నారు.కూటమి ప్రభుత్వం నాణ్యమైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అందించడం సహా తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తోందని చెప్పారు.
అయిదు సంవత్సరాలలో హిందూ ధర్మాన్ని ఎంత వెనక్కి నెట్టారో.. హిందూ దేవాలయాల పైన దాడులు ఎన్ని చేశారో ఇవన్నీ చర్చించుకునేందుకే సభను నిర్వహించుకున్నామని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందూ ధర్మంలో ఏవిధంగా చక్కగా శాంతియుతంగా ఆలనా పాలనా జరుగుతున్నదనే దానిపై చర్చించామని అన్నారు. ఎన్డీయే రెండు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో దేవాలయాలకు పునర్జీవం ఎలా కలిగింది అనే విస్తృతంగా చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని కాపాడుతున్న ఎన్డీయే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభకు హిందూ బంధువులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

