పంచాయ‌తీ నామినేష‌న్లు.. ప‌ల్నాడులో హైటెన్ష‌న్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ పంచాయ‌తీ ఎన్నికల (AP Panchayat Election) నామినేష‌న్ల ప‌ర్వంలో ప‌లు చోట్ల తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకుంటున్నాయి. ప‌ల్నాడు జిల్లాలో అధికార టీడీపీలోనే వ‌ర్గ‌పోరు ఆస‌క్తిక‌రంగా మారింది. రొంపిచ‌ర్ల మండ‌లం విప్ప‌ర్ల పంచాయ‌తీకి నామినేష‌న్లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు రెండు వ‌ర్గాలుగా చీలిపోయారు. గురువారం క‌ర్ర‌లు, రాళ్లతో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. పోలీస్ స్టేష‌న్ ఎదుటే ఈ దాడులు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. దాడుల్లో పెట్రోల్ బాంబుల‌ను వినియోగించ‌డం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు. ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణ‌మైన ఇరు వ‌ర్గాల నాయ‌కుల‌పై కేసులు కూడా న‌మోదు చేశారు.

ఈ నామినేష‌న్ల పంచాయితీలో ఎస్పీ హ‌నుమంత రావు జోక్యం చేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఒక వ‌ర్గం వారితో మాట్లాడి నామినేష‌న్ వేయొద్ద‌ని ఒత్తిడి చేసిన‌ట్లుగా స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో అధికారి తీరును నిర‌సిస్తూ న‌ర‌సారావుపేట రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ఎదుట స‌ద‌రు వ‌ర్గం టీడీపీ నేత‌లు బైఠాయించారు. ఈ క్ర‌మంలో ఓ టీడీపీ నేత ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. పోలీసులు స‌కాలంలో స్పందించి నిప్పు అంటించుకోకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఎన్నిక‌ల వ్య‌వ‌హారంలో ఎందుకు త‌ల‌దూరుస్తున్నార‌ని, అభ్య‌ర్థుల‌ను ఎందుకు ఒత్తిడికి గురి చేస్తున్నార‌ని ఆందోళ‌న చేప‌ట్టిన వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : నా లక్ష్యం అదొక్కటే.. లోకేష్ ఆసక్తికర పోస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>