Mobile Popup Ad
Mobile Popup Ad

చల్లని కబురు.. ఆ జిల్లాలకు భారీ వర్షసూచన

కలం, వెబ్ డెస్క్: ఎండాకాలం దృష్ట్యా భారీ ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణలో రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Heavy Rains) పడుతాయని తెలిపింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించింది.

మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు (Heavy Rains) అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగి, తదుపరి మూడు రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.

Read Also: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ : ఈసారి రెడ్లకు నో ఛాన్స్!!

Follow Us On: WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>