Mobile Popup Ad
Mobile Popup Ad

నాసిక్ మెడికల్ కాలేజీలో లిఫ్ట్ ప్రమాదం.. మహిళ మృతి

కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర (Maharashtra) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాసిక్‌లోని ఓ మెడికల్ కాలేజీలో లిఫ్ట్ ప్రమాదం (Lift Mishap) లో ఒక మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. జ్యోతి (50) అనే మహిళ లిఫ్ట్ వద్దకు వెళ్లి కిందకు తొంగి చూసింది. అదే సమయంలో లిఫ్ట్ అకస్మాత్తుగా కిందకు రావడంతో ఆమె తల లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయింది.

ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడి సిబ్బంది వెంటనే స్పందించి జ్యోతిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>