కలం, వెబ్ డెస్క్ : రేపు (ఏప్రిల్ 30) ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన కీలక క్యాబినెట్ మీటింగ్ (Cabinet Meeting) జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త పెన్షన్ల మంజూరు, వాటి విధివిధానాలపై ప్రధానంగా చర్చ జరగనుందని సమాచారం. అలాగే వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
ఇటీవల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్యపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా తెలియజేసే అంశంపై మంత్రులు దృష్టి పెట్టనున్నారు. అలాగే మంత్రుల బృందం ఇటీవల చేసిన సింగపూర్ పర్యటన, అక్కడ అధ్యయనం చేసిన అభివృద్ధి నమూనాలు, విధానాలపై సమీక్ష జరగనుంది. ఈ సమావేశం రాష్ట్ర పాలనలో కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

