కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయంగా నెలకొన్న ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులో కస్టమర్లతో నేరుగా సంబంధం లేని వ్యాపార, కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులకు వారంలో రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నట్లు వెల్లడించింది.
ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు కార్పొరేట్ సంస్థలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఈ విధానాన్ని మొదటగా నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని, ఉద్యోగుల పనితీరు, సేవల నాణ్యతను బట్టి దీనిని భవిష్యత్తులో శాశ్వతంగా కొనసాగించాలా లేదా అనే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ట్రెజరీ ఆపరేషన్స్, అంతర్గత బ్యాంకు లావాదేవీల విభాగం, డిజిటల్ బ్యాంకింగ్,హెచ్ఆర్ డిపార్టుమెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, బ్రాంచ్‌లకు వచ్చే కస్టమర్లతో నేరుగా ముఖాముఖి సంబంధాలు కలిగి ఉండే ఫ్రంట్ ఆఫీస్, క్యాష్ కౌంటర్ వంటి విభాగాల ఉద్యోగులకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం వర్తించదని పేర్కొంది.

